VIDEO: అగ్నికి ఆహుతైన సరుగుడు పంట

SKLM: లావేరు మండలం బుడతవలసలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన రైతులు అప్పలనాయుడు, రామ్మూర్తి, తవుడు, అన్నంనాయుడు, కసవయ్య, సావిత్రి, రమణలకు చెందిన సరుగుడు పంట కాలిపోయింది. ఈ పంటకు కొంత దూరంలో ఉన్న కుప్పకు అగ్గి పెట్టారు. వేగంగా వీస్తున్న గాలులకు ఈ సరుగుడు పంటకు అగ్గి అంటుకుని కాలిపోయింది. సుమారు 6 ఎకరాల మేరకు ఆస్తినష్టం జరిగింది.