విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి'

విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి'

NRML: విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వైద్యులు రాంపెల్లి రమేష్ అన్నారు. శనివారం సోను మండలంలోని లెఫ్ట్ పోచంపాడు టీఎస్ఆర్ జెసి పాఠశాల కళాశాలలోని విద్యార్థులకు ఆర్.బి.ఎస్.కె ఆధ్వర్యంలో వైద్య పరీక్షలను నిర్వహించారు. విద్యార్థులకు 10 ఆరోగ్య సూత్రాలను వివరించారు. ప్రధానోపాధ్యాయురాలు ప్రశాంతి వైద్య సిబ్బంది సుచరిత అనిత తదితరులున్నారు.