'నాటు తుపాకులు ఉన్నవారు స్వచ్చందంగా అప్పగించాలి'

VZM: చీపురుపల్లి సీఐ శంకరరావు ఆధ్వర్వంలో శుక్రవారం గరివిడి మండలం సేరిపీట ఎరుకల కాలనీలో స్దానిక పోలీసులు నాటు తుపాకీల ఏరివేతకు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ... లైసెన్సులు లేకుండా నాటు తుపాకీలు వినియోగించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఎవరి దగ్గరైనా నాటు తుపాకీలు ఉన్న వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కోరారు.