టీచర్‌గా మారిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
ATP: యాడికిలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గురువారం పర్యటించారు. బుగ్గ రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమై పాఠ్యాంశాలను బోధించారు. టీచర్లు అర్థమయ్యే విధంగా పాఠాలు చెప్తున్నారా?లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు ప్రహరీ కావాలని విద్యార్థులు అడగగా.. నిర్మిస్తామని హామీ ఇచ్చారు.