'అర్హులందరికి సంక్షేమ పథకాలు అందిస్తాం'
SKLM: అర్హులందరికి సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రభుత్వం విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబు అన్నారు. కవిటి మండలం రాజపురంలో 'రైతన్న మీ కోసం' ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన ఇవాళ పాల్గొన్నారు. రైతుల ఇంటింటికి వెళ్లి వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి వివరించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.