అభివృద్ధిని జగన్ ఓర్వలేకపోతున్నారు: నిమ్మల
AP: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా మేడపాడు నుంచి యలమంచిలి వరకు టీడీపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల బైక్ నడిపి సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతుంటే జగన్ ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు.