VIDEO: ఆశ్చర్యం.. భూమిలోంచి ఉబికి వస్తున్న నీరు..!
NGKL: ఊరుకొండ మండలం జకినాలపల్లి గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇవాళ ఓ వింత చోటుచేసుకుంది. గ్రామంలోని వ్యవసాయ పొలంలో భూమిలో నుంచి నీటి బుడగలు ఉబికి వస్తుండటంతో స్థానికులు ఆశ్చర్యానికి, భయానికి గురయ్యారు. 'అయ్యో! ఎంత విచిత్రంగా ఉందో! మున్ముందు ఇంకేమి వింతలు జరుగుతాయో' అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.