భార్య గెలుపు కోసం తపన.. తీరా చూస్తే..!
MNCL: మందమర్రికు చెందిన శ్రీనివాస్ 2012లో జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. అతను ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ.. భార్యను గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు సహయం చేశాడు. అయితే జ్యోతి ఎక్సైజ్ సీఐగా ఉద్యోగం వచ్చిన తరువాత భర్తను దూరం పెట్టడం ప్రారంభించింది. అంతే కాకుండా భర్తపై కేసులు పెట్టింది. తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.