చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం: మాజీ మంత్రి
ATP: జిల్లాలో గిట్టుబాటు ధర పెంచాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో రైతులు అరటి గెల్లలతో కలెక్టరేట్ వద్ద భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. కేజీ అరటి రూ. 2కే అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. "గిట్టుబాటు ధర ఇవ్వకపోతే జిల్లాను దిగ్బంధనం చేస్తాం, చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం" అని శైలజానాథ్ హెచ్చరించారు.