మనస్థాపానికి గురై యువకుడు ఆత్మహత్య

SDPT: తొగుట మండలం కేంద్రానికి చెందిన సిలివేరు నరేష్ గౌడ్(30) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీవ్ర మనస్థాపానికి గురై ఉరి వేసుకొని మృతి చెందాడు. మృతునికి ముగ్గురు అక్కలు ఉన్నారు. మృతుని తండ్రి వెంకట్ గౌడ్ ఫిర్యాదు మేరకు తొగుట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.