VIDEO: కె.గంగవరం మండలంలో భారీ వర్షం

VIDEO: కె.గంగవరం మండలంలో భారీ వర్షం

E.G: కె.గంగవరం మండలంలో పలుచోట్ల బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోత తో ఉన్న వాతావరణం ఒక్క సారిగా మేఘావృతమై భారీ వర్షం కురిసింది. జోరుగా కురిసిన వర్షం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. గత వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టుకుంటున్న రైతులు వర్షానికి పరుగులు పెట్టారు.