శ్రీకాళహస్తిలో దొంగతనానికి యత్నం

TPT: శ్రీకాళహస్తిలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న టీ దుకాణంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించి విఫలమయ్యారు. మునస్వామి అనే వ్యక్తి టీ దుకాణం, ఆయన కుమారుడు పాల వ్యాపారం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. రాత్రి యథావిధిగా షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్లారు. ఉదయం వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.