కెన్యాలో వరదలు.. 23 మంది మృతి
కెన్యా రాజధాని నైరోబీలో కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకధాటిగా పడుతున్న వానల వల్ల అక్కడ జనజీవనం స్తంభించింది. ఆకస్మిక వరదల వల్ల 23 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.