పాకిస్తాన్‌కు వీసా నిలిపివేసిన ఖతార్

పాకిస్తాన్‌కు వీసా నిలిపివేసిన ఖతార్

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు వివిధ దేశాల్లోని దౌత్య, రవాణా సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి అమెరికా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో నెలకొన్న అస్థిరతను దృష్టిలో ఉంచుకుని ఖతార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ పౌరులకు ఇప్పటివరకు కల్పిస్తున్న 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.