ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

కృష్ణా: కృత్తివెన్ను మండలం ఓర్లగొందితిప్ప గ్రామంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని గురువారం ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఎనలేని సేవలు చేసిన మహానాయకుడని పేర్కొన్నారు.