సమయపాలన పాటించని వార్డులపై చర్యలు తీసుకోవాలి: SFI
MHBD: జిల్లా గురుకుల, సామాజిక సంక్షేమ హాస్టళ్లలో వార్డెన్లు సమయపాలన పాటించకపోవడం, హాజరు లేకున్నా వచ్చినట్లు నమోదు చేసుకోవడం, మెనూ ప్రకారం భోజనం అందించకపోవడంపై SFI ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ SFI జిల్లా సహాయ కార్యదర్శి రాకేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణం ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.