ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన లాలూ యాదవ్ కొడుకు!

ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన లాలూ యాదవ్ కొడుకు!

బీహార్‌లో ఓటమి తర్వాత ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌కు వరుస షాక్‌లు తగుతున్నాయి. ఇప్పటికే ఆయన కుమార్తె రోహిణీ పార్టీ, ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తాజాగా ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు చెందిన జనశక్తి జనతాదళ్ పార్టీ NDAకు నైతిక మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ యాదవ్ వెల్లడించారు.