శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ ఆదాయ వివరాలు

కృష్ణా: మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానానికి ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం ఒక్కరోజు ఆలయానికి భక్తులు వివిధ సేవా రుసుముల ద్వారా రూ. 9.73 లక్షల ఆదాయం సమర్పించారని ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఆది, మంగళవారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, వారికి అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని అన్నారు.