"వెంటనే చేతి పంపును మరమ్మత్తులు చేయించాలి"

"వెంటనే చేతి పంపును మరమ్మత్తులు చేయించాలి"

MLG: వెంకటాపూర్ మండలం గుంటూరుపల్లి ఆయకట్టు పరిధిలో ఉన్న చేతి పంపులు పనిచేయక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాలకు వెళ్లే వ్యవసాయ కూలీలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన పంపులు చెడిపోవడంతో నీటి కొరత ఏర్పడింది. వేసవి తీవ్రతతో సమస్య మరింత పెరిగిందని రైతులు తెలిపారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.