VIDEO: ఆకట్టుకున్న బాలల నృత్య ప్రదర్శన

SRD: సిర్గాపూర్ మండలంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ప్రజలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. బొక్కస్‌గాంలో స్థానిక హనుమాన్ మందిరంలో గోకులాష్టమి వేడుక సంబరాలు జరిపారు. ఇందులో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషాధారణలో కోలాటాలు, నృత్యాలు చేసి అదరగొట్టారు. అదేవిధంగా వివిధ సాంస్కృతిక ప్రదర్శన చేసి అందర్నీ అలరించారు.