తాగునీటి వాటర్ ట్యాంకును ప్రారంభించిన ఎమ్మెల్యే
కోనసీమ: అయినవిల్లి మండలంలోని తొత్తరమూడి గ్రామంలో రూ. 45.34 లక్షల వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఇంటింటికీ తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వారా జయ సావిత్రి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దాల సుబ్బారావు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు.