సీఐఐ సమ్మిట్‌ భద్రతపై డీఐజీ స‌మీక్ష

సీఐఐ సమ్మిట్‌ భద్రతపై డీఐజీ స‌మీక్ష

VSP: ఈ నెల 14, 15 తేదీలలో విశాఖ‌లో జరగనున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ భద్రతా ఏర్పాట్లపై విశాఖపట్నం రేంజ్ డీఐజీ, ఇంచార్జ్ సీపీ గోపినాథ్ జెట్టి సోమవారం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమ్మిట్‌ను సురక్షితంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. నగర ప్రవేశ మార్గాల వద్ద వాహనాల తనిఖీని పటిష్టం చేయాలని ఆదేశించారు.