ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి
WNP: పానగల్ మండలం బుసిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.