నేడు తాండవ జలాశయం నుంచి నీరు విడుదల

KKD: ఆయకట్టు అవసరాల కోసం తాండవ జలాశయం నుంచి ఆదివారం నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్ డీఈఈ అనురాధ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి అనిత గంగమ్మకు హారతి ఇచ్చి నీటిని విడుదల చేస్తారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయకట్టు రైతులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆమె కోరారు.