ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ముందడుగు
VZM: పుసపాటిరేగ ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించి, సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను వేగంగా పరిష్కరించే దిశగా తక్షణ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. భూముల ఆక్రమణలు, బీసీ కాలనీ రోడ్డు సమస్యలపై చర్చించారు.