గ్రామాలలో మొదలైన ఎన్నికల సందడి
KMM: బోనకల్ము మండలం ష్టికుంట్ల గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తమ నామినేషన్‌ను దాఖలు చేసింది. సర్పంచ్ పదవికి కాంగ్రెస్ తరఫున పిల్లలమర్రి నాగేశ్వరరావు నిన్న నామినేషన్ పత్రాలను సమర్పించారు. స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు ఆయనతో కలిసి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నికల సందడి మొదలైంది.