'ఆద్య క్రాంతికారి' వాసుదేవ బల్వంత ఫడ్కేకు నివాళులు
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో సాయుధ విప్లవానికి నాంది పలికిన 'ఆద్య క్రాంతికారి' వాసుదేవ బల్వంత ఫడ్కే జయంతి నేడు(నవంబర్ 4, 1845). బ్రిటీష్ పాలనలో రైతుల కష్టాలు(ముఖ్యంగా 1876 కరువు) చూసి చలించిపోయి.. 'రామోషీ' విప్లవ సైన్యాన్ని తయారుచేశారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా గెరిల్లా దాడులు చేశారు. 1883లో ఎడెన్ జైలులో మరణించిన ఫడ్కే పోరాటం తర్వాతి విప్లవకారులకు స్ఫూర్తినిచ్చింది.