చందర్లపాడులో 'సుపరిపాలనలో తొలి అడుగు'

NTR: చందర్లపాడు మండలం, ముప్పాళ్ళలో మంగళవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తంగరాల సౌమ్య నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.