జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఈసీ కీలక ఆదేశాలు
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. ఆరు గంటల తర్వాత స్థానికేతరులు నియోజక వర్గం వదిలి వెళ్లాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇప్పటి నుంచి 12వ తేదీ ఉదయం 6 గంటల వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో వైన్స్, పబ్బులు మూసివేయాలని ఆదేశించింది. కాగా, ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 14 ఓట్ల లెక్కింపు చేయనున్నారు.