VIDEO: 'ఆక్రమణలు తొలగించకుండానే కల్వర్ట్ నిర్మిస్తున్నారు'
KDP: ప్రొద్దుటూరులోని వినాయక నగర్ కల్వర్ట్‌ను ఇవాళ మున్సిపల్ అధికారులు తొలగించారు. వినాయకనగర్ - గాంధీ రోడ్డు మార్గంలో రూ. 8 లక్షల అంచనాతో నూతన కల్వర్ట్‌ను నిర్మిస్తున్నారు. అయితే డ్రైనేజీ కాల్వపై ఆక్రమణలు తొలగించకుండా బాగున్న కల్వర్ట్‌ను తొలగించడం ఏంటిని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇరువైపుల కాల్వపై అక్రమంగా నిర్మించిన స్లాబులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.