గ్రామసభలో రోడ్డు భద్రతపై అవగాహన

గ్రామసభలో రోడ్డు భద్రతపై  అవగాహన

SDPT: బెజ్జంకి గ్రామంలో గ్రామాభివృద్ధి, రోడ్డు భద్రతపై గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ బొల్లం శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. రహదారి పక్కనున్న పొదలు ప్రమాదకరమని చర్చించి తొలగించాలని నిర్ణయించారు. ప్రజల సహకారంతో పొదల తొలగింపు చేపట్టగా, దృశ్యమానత మెరుగై భద్రత పెరుగుతుందని తెలిపారు.