VIDEO: మత్స్యకారుల వలకు చిక్కిన భారీ చేప

KNR: సంగంపల్లికి చెందిన మత్పకారుడు కూన సంపత్‌కు 25 కిలోల బొచ్చె చేప చిక్కింది. సంపత్ సోమవారం LMDలో చేపలు పడుతుండగా 25 కిలోల బొచ్చె చేప దక్కింది. చాలా అరుదుగా పెద్ద చేపలు వలకు చిక్కుతాయని సంపత్ ఆనందం వ్యక్తం చేశారు. మార్కెట్లో బొచ్చె చేపకు కిలో రూ.150ల చొప్పున పలుకుతుండగా.. ఈ భారీ చేపను విక్రయించగా రూ.3750 వచ్చినట్లు సంపత్ చెప్పారు.