'బోథ్ ఎమ్మెల్యే గారూ.. మా ఊరికి రండి'

ADB: 'వానాకాలంలో మా ఊరికి రావొచ్చు కదా.. బోథ్ ఎమ్మల్యే అనిల్ జాదవ్ సార్' అని గుబిడి గ్రామస్థులు పేర్కొంటున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి భీంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యేకు తమ గ్రామం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో తమ సమస్యలు చూస్తేనే కదా.. వాటి తీవ్రత తెలుస్తుందని పేర్కొంటున్నారు.