చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ

NLR: జిల్లాలోని సంతపేటలో ఉచిత ఖత్నా చేయించుకున్న 50మంది చిన్నారులకు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పౌష్టికాహారం, బట్టలను పంపిణీ చేశారు. మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ సహకారంతో పేద పిల్లలకు సామూహిక ఖత్నా కార్యక్రమం చేయించడం అభినందనీయమని, పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.