భక్త కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ
KRNL: హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో భక్త కనకదాసు విగ్రహాన్ని ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీలో ఎలాంటి వర్గాలు లేవని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్రప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు.