'మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు'
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలను కట్టుదిట్టం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ వంటి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఆ మేరకు మద్యం సేవించి వాహనం నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.