ఎంపీ నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
NRPT: మరికల్ మండలంలోని కన్మనూర్ గ్రామంలో ఎంపీ రూ.5 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు సర్పంచ్ అంకిత సురేందర్ గౌడ్ శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. ఎంపీ డీకే అరుణకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు