అటవీశాఖ అధికారులకు పవన్ దిశానిర్దేశం
AP: అటవీ భూముల పరిరక్షణపై అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు శాఖ వెబ్‌సైట్‌లో ఉంచాలని సూచించారు. అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణలపై విజిలెన్స్ రిపోర్టులను ప్రాతిపదికగా తీసుకోవాలన్నారు.