'అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు'
NZB: సాలూరలోని ఖాజాపూర్ గ్రామ శివారులోని మంజీర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాలీ ఆటోలను నేడు రెవెన్యూ సిబ్బంది పట్టుకున్నారు. తహసీల్దార్ ఎంఏ నవాజ్ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నది పరివాహక ప్రాంతాల్లో నిఘా పెంచామని, అక్రమ రవాణాకు పాల్పడితే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు