లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

ప్రకాశం: ఒంగోలులోని పాత గుంటూరు రోడ్డులో ఉన్న ఓ లాడ్జిలో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన కీర్తి ఆంజనేయులు (28)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.