మహిళల భద్రతలో ప్రభుత్వాలు విఫలం: SFI
HNK: జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలో ఇవాళ SFI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా SFI రాష్ట్ర కమిటీ సభ్యురాలు దాసగాని సుమ హాజరై, మాట్లాడుతూ.. మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆమె ఆరోపించారు. మహిళలపై దాడులు నియంత్రించి, సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.