యోగా పోటీ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
BPT: జాతీయ స్థాయి యోగాసన పోటీలకు బాపట్ల నియోజకవర్గం వేదిక కాబోతోంది. ఈ నెల 27, 28, 29 తేదీలలో శ్రీ విశ్వజననీ పరిషత్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మంగళవారం పరిశీలించారు. సభాస్థలి తదితర అంశాలపై నిర్వాహకులతో సమీక్ష జరిపారు.