'ప్రతి ఉద్యోగి రక్షణ సూత్రాలు పాటించాలి'

'ప్రతి ఉద్యోగి రక్షణ సూత్రాలు పాటించాలి'

MNCL: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ ఓసీపీలో 56వ రక్షణ పక్షోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఓసీ ఆవరణలో ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేశ్వర్లు జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి రక్షణ సూత్రాలు పాటిస్తూ ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్, ఇంజనీర్ నాగరాజు పాల్గొన్నారు.