నంద్యాల కలెక్టర్‌ను కలిసిన డోన్ ఎమ్మెల్యే
నంద్యాల కలెక్టరేట్లో కలెక్టర్ రాజకుమారిని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి మంగళవారం కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సమగ్రంగా చర్చించారు. రోడ్ల అభివృద్ధి, తాగునీటి సరఫరా సమస్యలు, ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో పారదర్శకత, వేగం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.