ఖమేనీ బంకర్‌పై.. 50 జెట్‌లతో బాంబుల వర్షం!
ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ భారీ స్థాయిలో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) వెల్లడించింది. సుప్రీం లీడర్ ఖమేనీ నివాస ప్రాంగణంలో నిర్మించిన అండర్ బంకర్ లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలిపింది. ఈ ఆపరేషన్‌లో 50 జెట్ విమానాలు పాల్గొన్నాయని పేర్కొంది. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ 'మొస్సాద్' సమన్వయంతో ఈ ఆపరేషన్ చేపట్టామని ఓ వీడియోను విడుదల చేసింది.