సింహాచలం ఆలయం మూసివేత
VSP: చంద్రగ్రహణం సందర్భంగా సింహాచలం దేవాలయాన్ని ఆలయ సిబ్బంది మంగళవారం మూసివేశారు. ఆలయంలో వైదిక కార్యక్రమాల అనంతరం ఉదయం 8.30 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేసి కవాట బంధనం చేశారు. అలాగే, ఆర్జిత సేవలు అన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం యథావిధిగా భక్తులకు దర్శనాలు కల్పిస్తామని ఈవో జె. వెంకటరావు పేర్కొన్నారు.