పేకాట మోసంపై వ్యక్తికి బైండోవర్
AKP: నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామంలో పులి పట్టాలు అనే వ్యక్తి కొంతకాలంగా పేకాట నిర్వహిస్తున్నాడు. ఎస్సై వై.తారకేశ్వరరావు అతన్ని తహసీల్దార్ ఏ.వేణుగోపాల్ వద్ద ఆరు నెలల సత్ప్రవర్తన కొరకు బైండోవర్ చేశారు. పాత కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని నర్సీపట్నం కోర్టుకు రవాణా చేసి విచారణకు హాజరయ్యేలా చేశారు. పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.