రిమ్స్ వైద్య విద్యార్థుల అనస్థీషియా అవగాహన ర్యాలీ

రిమ్స్ వైద్య విద్యార్థుల అనస్థీషియా అవగాహన ర్యాలీ

SKLM: శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి వైద్య విద్యార్థులు గురువారం నగరంలో అనస్థీషియా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించారు. శస్త్రచికిత్స సమయంలో రోగిని కాపాడే అనస్థీషియా సేవలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని అనస్థీషియా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని విద్యార్థులు తెలిపారు.