బహిరంగ వేళంలో రూ. 2.56 లక్షల ఆదాయం
NDL: డోన్ మున్సిపాలిటీకి బహిరంగ వేళంలో రూ.2.56 లక్షల ఆదాయం వచ్చినట్లు కమిషనర్ ప్రసాద్ గౌడ్ తెలిపారు. గురువారం దినసరి కూరగాయలు మార్కెట్, మాంసపు దుకాణాల సుంకాలు, వారపు సొంత మార్కెట్, బస్టాండ్లకు బహిరంగ వేళాలు నిర్వహించారు. గతేడాది రూ.19 లక్షలకు గుత్తేదారుడు దక్కించుకోగా.. ప్రస్తుత ఏడాదికి రూ.21.56 లక్షలకు షేక్ మహమ్మద్ అజీజ్ అనే వ్యక్తి దక్కించుకున్నారన్నారు.