అక్రమ కట్టడాలను తొలగించిన రెవెన్యూ సిబ్బంది
AKP: గొలుగొండ మండలం ఎల్లవరం పంచాయతీ పరిధిలో కొల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రభుత్వ రెవెన్యూ భూమిని అక్రమంగా ఆక్రమించి శివ గంగ వాటర్ ప్లాంట్ నిర్మించినట్లు గుర్తించారు. సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు స్థలాన్ని పరిశీలించి జేసీబీ సహాయంతో ప్లాంట్‌ను తొలగించారు. అనంతరం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు.